భారతదేశం, డిసెంబర్ 9 -- ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజలకు సులభంగా, పారదర్శకంగా రేషన్ అందించేందుకు స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అక్రమార్కులకు చెక్ పెట్టాలని భావిస్తోంది. ఆగస్టు నుంచి వీటిని పంపిణీ చేస్తోంది ఏపీ. ఇప్పటికే చాలా వరకు పంపిణీ చేసింది.

గ్రామ, వార్డు సచివాలయాల్లో అధికారులకు అప్పగించే బాధ్యతను ఇచ్చింది. అంతేకాదు వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే వెళ్లి ఇవ్వాలని ప్రభుత్వం చెప్పింది. ఈ నెల 15వ తేదీ వరకు పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. అయితే చాలా మంది లబ్ధిదారులు ఇంకా వాటిని తీసుకోలేదు. వేలాది కార్డులు పంపిణీ చేయలేదు. 15వ తేదీ తర్వాత వాటిని కమిషనరేట్‌కు పంపనున్నారు.

గడువు దగ్గరకు...