భారతదేశం, ఏప్రిల్ 18 -- తక్కువ ధరకు ఎక్కువ మైలేజీ ఇచ్చే స్కూటర్ కోసం చాలా మంది చూస్తుంటారు. ఇంట్లో స్కూటీ ఉంటే మహిళలకు కూడా ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. బడ్జెట్ ‌ధరలో మీరు స్కూటీ కొనాలనుకుంటే కొన్ని బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో హోండా యాక్టివా నుండి యమహా ఫాసినో 125 వరకు ఉన్నాయి. ఓసారి ఆ లిస్టు ఏంటో చూద్దాం..

సుజుకి యాక్సెస్ 125 కూడా మార్కెట్లో బాగా ఫేమస్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.82,900 నుండి రూ.94,500 మధ్య ఉంటుంది. ఇందులో 124సీసీ ఇంజిన్ ఉంది. 8.42 పీఎస్ శక్తిని, 10.2 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజ్ 45 కి.మీ. ఈ స్కూటర్‌లో ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ స్క్రీన్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, హజార్డ్ లైట్, ముందు భాగంలో డ్యూయల్ యుటిలిటీ పాకెట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సుజుకి యాక్సెస్ డిస్క్, డ్రమ్ బ్రేక్ ఎంపికలలో లభిస్తుంది.

టీవీఎస్ ...