Hyderabad, జూలై 8 -- జియోహాట్‌స్టార్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ స్పెషల్ ఆప్స్ (Special Ops). ఈ సిరీస్ ఇప్పుడు స్పెషల్ ఆప్స్ 2.0తో రాబోతోంది. అయితే ఈవారమే ఓటీటీలోకి రావాల్సి ఉన్నా.. రిలీజ్ డేట్ ను వారం పాటు వాయిదా వేశారు. ఈ విషయాన్ని ఈ సిరీస్ లో హిమ్మత్ సింగ్ పాత్ర పోషించిన కే కే మేనన్ ఓ వీడియో ద్వారా వెల్లడించాడు.

స్పెషల్ ఆప్స్ 2.0 వెబ్ సిరీస్ నిజానికి వచ్చే శుక్రవారం (జులై 11) జియోహాట్‌స్టార్ లో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఇప్పుడీ రిలీజ్ ను వాయిదా వేశారు. జులై 11 బదులుగా జులై 18 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. కొన్ని విషయాలు తమ చేతుల్లో ఉండవని, అందుకే రిలీజ్ వాయిదా వేయాల్సి వచ్చిందని ఈ సిరీస్ లీడ్ రోల్ కే కే మేనన్ చెప్పాడు. ఇది నిజంగా అభిమానులకు బ్యాడ్ న్యూసే.

అయితే అన్ని ఎపిసోడ్లను ఒకేసారి రిలీజ్ చేయనున్నట్లు కూడా ఈ సందర్...