Hyderabad, జూన్ 16 -- ఓటీటీలో ఇప్పటి వరకూ వచ్చిన బెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో ఒకటి స్పెషల్ ఓపీఎస్ (Special Ops). జియోహాట్‌స్టార్ లో ఇప్పటికే తొలి సీజన్, తర్వాత 1.5 అంటూ మరో షార్ట్ సీజన్ కూడా స్ట్రీమింగ్ అయింది. ఇక ఇప్పుడు రెండో సీజన్ రాబోతోంది. తాజాగా సోమవారం (జూన్ 16) ట్రైలర్ రిలీజ్ కాగా.. జులై 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ప్రముఖ బాలీవుడ్ నటుడు కే కే మేనన్.. హిమ్మత్ సింగ్ అనే పాత్రలో నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్పెషల్ ఓపీఎస్. ఇప్పుడు రెండో సీజన్ మరింత గ్రాండ్ గా, అదిరిపోయే యాక్షన్ తో రాబోతోంది. జులై 11 నుంచి రెండో సీజన్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు జియోహాట్‌స్టార్ వెల్లడించింది. ఈ సందర్భంగా ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ అంచనాలను మించి సాగింది....