Hyderabad, మే 15 -- ఇండియన్ ఓటీటీ స్పేస్‌లో ఇప్పటి వరకూ వచ్చిన అద్భుతమైన వెబ్ సిరీస్ లలో ఒకటి స్పెషల్ ఆప్స్ (Special Ops). ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే తొలి సీజన్ తోపాటు 1.5 పేరుతో ఓ చిన్న సీజన్ ను కూడా పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు పూర్తిస్థాయిలో రెండో సీజన్ రాబోతోంది. హిమ్మత్ సింగ్ పాత్రలో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి కేకే మేనన్ వచ్చేస్తున్నాడు.

స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గా స్పెషల్ ఆప్స్ తెరకెక్కింది. ఈ సిరీస్ రెండో సీజన్ టీజర్ ను గురువారం (మే 15) రిలీజ్ చేశారు. హాట్‌స్టార్ స్పెషల్స్ గా ఈ సిరీస్ వస్తోంది. ఈ రెండో సీజన్ టీజర్ ఫుల్ యాక్షన్ తో నిండిపోయింది. అసలు ఒక్క డైలాగ్ కూడా లేదు. ఇండియాలో గూఢచర్యం జానర్లో వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్ కంటే పూర్తి భిన్నంగా, దానిని మరో లెవెల్ కు తీసుకెళ్లిన సిరీస్ ఇది.

నీరజ్ పాండే డైరెక్ట్ చేసిన...