భారతదేశం, జూన్ 18 -- స్పై థ్రిల్లర్ సిరీస్ 'స్పెషల్ ఓపీఎస్' మరో సీజన్ కోసం తిరిగి వస్తోంది. దీని కోసం అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. స్పెషల్ ఓపీఎస్ 2 అనేది స్పెషల్ ఓపీఎస్ (2020), దాని స్పిన్-ఆఫ్ స్పెషల్ ఓపీఎస్ 1.5 (2021) కు సీక్వెల్. వెబ్ సిరీస్ రెండవ సీజన్ కోసం కే కే మీనన్ కఠినమైన గూఢచారి హిమ్మత్ సింగ్ పాత్రను తిరిగి పోషించడంతో పాటు ఈ సారి కథ సైబర్-టెర్రరిజం చుట్టూ తిరుగుతుంది.

జియోహాట్‌స్టార్‌లో ప్రసారం కానున్న స్పెషల్ ఓపీఎస్ రెండవ సీజన్ రిలీజ్ డేట్ కన్ఫామైంది. ఈ స్పై-థ్రిల్లర్ సిరీస్ జులై 11న విడుదల అవుతుంది. "ఈసారి, అందరూ టార్గెట్! సైబర్-టెర్రరిజం వర్సెస్ హిమ్మత్ సింగ్ అండ్ అతని బృందం" అని జియో హాట్‌స్టార్ ఓటీటీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

అదృష్టవశాత్తూ అభిమానులు స్పెషల్ ఓపీఎస్ అన్ని ఎపిసోడ్‌లను ఒకేసారి చూడగలుగుతారు. ఒక్కో ఎపిసోడ్ ...