భారతదేశం, నవంబర్ 3 -- ఇటీవల కర్నూలు బస్సు ప్రమాదం మరవకముందే తాజాగా తెలంగాణ రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మందికిపై మరణించారు. రెండు ఘటనల్లోనూ ఓవర్ స్పీడ్ ప్రధాన కారణంగా ఉంది. డ్రైవర్ల అతివేగంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అతివేగంతో జరిగే మరణాలు ఎక్కువగా ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా హైవేలలో ప్రతిరోజూ సగటున 15 మంది అతివేగం కారణంగా మరణిస్తున్నారు. 2023లో మాత్రమే, రెండు రాష్ట్రాలలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై 5,500 మంది అతివేగం సంబంధిత ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనకరమైన విషయం ఏంటంటే.. తెలుగు రాష్ట్రాల్లో జరిగే అన్ని రోడ్డు ప్రమాద మరణాలలో 30 శాతం కంటే ఎక్కువ అతివేగం కారణంగానే సంభవించాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల జరుగుతున్న ప...