భారతదేశం, ఏప్రిల్ 26 -- జపనీస్ సినిమా 'బుల్లెట్ ట్రైన్ ఎక్స్‌ప్లోజన్' నేరుగా ఓటీటీలోకి వచ్చింది. ఈ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో సుయోషి కుసనాగి, కనాటా హొసోడా లీడ్ రోల్స్ చేశారు. ఈ చిత్రానికి షింజి హుగుచి దర్శకత్వం వహించారు. 1975లో వచ్చిన బుల్లెట్ ట్రైన్ మూవీకి సీక్వెల్‍‌గా ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ చిత్రం రూపొందింది. బుల్లెట్ ట్రైన్ ఎక్స్‌ప్లోజన్ సినిమా డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. ఆ వివరాలు ఇవే..

బుల్లెట్ ట్రైన్ ఎక్స్‌ప్లోజన్ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో తాజాగా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. థియేటర్లలో రాకుండా నేరుగా ఓటీటీలోకే ఎంట్రీ ఇచ్చింది. జపనీస్‍తో పాటు ఇంగ్లిష్, తెలుగు, తమిళం, హిందీలోనూ నెట్‍ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది.

బుల్లెట్ ట్రైన్ ఎక్స్‌ప్లోజన్ మూవీ ఇంట్రెస్టింగ్ స్టోరీలైన్‍తో తెరకెక్కింద...