భారతదేశం, డిసెంబర్ 30 -- ఉద్యోగాల భర్తీలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు స్పీడ్ పెంచింది. ఇటీవలే 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసిన బోర్డు.. తాజాగా స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టుల ఫస్ట్‌ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ లిస్టును వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది.

అభ్యర్థి అకాడమిక్ క్వాలిఫికేషన్‌లో సాధించిన మార్కులు, వెయిటేజీ ద్వారా సాధించిన మార్కులు, వారి స్థానికతకు సంబంధించిన అంశాలు సహా అన్ని వివరాలను వెబ్‌సైట్‌లో (http://mhsrb.telangana.gov.in/) అందుబాటులో ఉంచామని బోర్డు వెల్లడించింది. వీటిపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని బోర్డు కోరింది. అభ్యంతరాలను జనవరి 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల నమోదు చేయాలని సూచించింది.

అభ్యంతరాలను అభ్యర్థి లాగిన్ ద్వార...