భారతదేశం, జనవరి 16 -- ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న మూవీ స్పిరిట్. ఈ మధ్యే మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కాగా.. ఇప్పుడు మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది మార్చి 5న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ప్రభాస్, తృప్తి డిమ్రి లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా స్పిరిట్. అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి ఆల్ఫా మేల్ డామినేటింగ్ సినిమాలు తీసిన సందీప్ రెడ్డి వంగాకు రెబల్ స్టార్ ఛాన్స్ ఇవ్వడంతో ఈ సినిమాపై ఎక్కడ లేని అంచనాలు ఉన్నాయి. ఇప్పుడీ మూవీ వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. "వెనక్కి తిరిగి చూసేదే లేదు. స్పిరిట్ వచ్చే ఏడాది మార్చి 5న థియేటర్లలో ప్రపంచాన్ని చూడబోతోంది" అనే క్యాప్షన్ తో మూవీ టీమ్ ట్వీట్ చేసింది.

స్పిరిట్ మూవీ నుంచి మొదట కేవల...