Hyderabad, సెప్టెంబర్ 18 -- ఇటీవల మధ్య కాలంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతోంది. ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తోన్న స్పిరిట్ మూవీ నుంచి హీరోయిన్‌గా దీపికా పదుకొణెను తొలగించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం, ఆ తర్వాత దీపికా పదుకొణె కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి.

అయితే, తాజాగా ప్రభాస్‌తో తెరకెక్కనున్న మరో సినిమా కల్కి 2 నుంచి కూడా దీపికా పదుకొణె అవుట్ అయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న కల్కి 2898 ఏడీ సీక్వెల్ మూవీలో హీరోయిన్‌గా దీపికా పదుకొణె నటించట్లేదని మేకర్స్ తెలిపారు. కల్కి 2898 ఏడీ సీక్వెల్‌లో దీపికా భాగం కాదని ప్రొడక్షన్ హౌజ్ వైజయంతీ మూవీస్ ట్విట్టర్‌లో అధికారికంగా ప్రకటించింది.

ట్విటర్‌లో "రాబోయే కల్కి 2898 ఏడీ సీక్వెల్ సినిమాలో దీపికా పదుకొణె భాగం కాదని అధికారికంగా ప...