Hyderabad, సెప్టెంబర్ 8 -- విపరీతమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న డైరెక్టర్లలో సందీప్ రెడ్డి వంగా ఒకరు. మొదటి తెలుగు సినిమా అర్జున్ రెడ్డితోనే డిఫరెంట్ అండ్ బోల్డ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు సందీప్ రెడ్డి వంగా. ఇక యానిమల్ మూవీతో ఇండియా వైడ్ క్రేజ్ సొంతం చేసుకున్నారు.

అప్పటివరకు అలాంటి స్క్రీన్ ప్లే, డైలాగ్స్, సీన్స్‌తో ఏ దర్శకుడు చేయని సాహసాన్ని చేసి సక్సెస్ సాధించిన ఘనత సందీప్ రెడ్డి వంగాది. అంతేకాకుండా మూడు గంటల రన్‌టైమ్‌తో సినిమాను తెరకెక్కించి అంతసేపు ఫుల్ ఎంగేజింగ్‌గా ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టిన ఫస్ట్ డైరెక్టర్‌గా సందీప్ రెడ్డినే నిలుస్తారు.

సందీప్ రెడ్డి వంగా టేకింగ్‌ను ప్రేక్షకులతోపాటు దర్శక దిగ్గజాలు అయిన ఎస్ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ వంటి వాళ్లు సైతం ప్రశంసించారు. అలాగే, రియల్ లైఫ్‌లో సందీప్ రెడ్డి వంగా మాటల...