భారతదేశం, జనవరి 1 -- న్యూ ఇయర్ 2026 రోజు ప్రభాస్ ఫ్యాన్స్ కు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. స్పిరిట్ పోస్టర్ రిలీజ్ చేశాడు. ఇందులో ప్రభాస్, హీరోయిన్ త్రిప్తి డిమ్రి లుక్స్ ఉన్నాయి. అయితే స్పిరిట్ సినిమాలో ప్రభాస్ లుక్స్ పై ట్రోల్స్ వస్తున్నాయి. చాలా మంది నెటిజన్లు ప్రభాస్ లుక్ ను 'యానిమల్' సినిమాలో ర‌ణ్‌బీర్ క‌పూర్‌ రా అండ్ రగ్గడ్ అవతార్ తో పోల్చుతున్నారు. సందీప్ ను ట్రోల్ చేస్తున్నారు.

న్యూ ఇయర్ 2026 అర్ధరాత్రి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న 'స్పిరిట్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్, తృప్తి డిమ్రి ఉన్నారు. ప్రభాస్ గాయపడిన శరీరం, పొడవాటి జుట్టు, దట్టమైన గడ్డంతో ఉన్నాడు. దీంతో ప్రభాస్ లుక్ సందీప్ గత మూవీ 'యానిమల్' సినిమాలోని ర‌ణ్‌బీర్ క‌పూర్‌ ను గుర్తు చేస్తుందనే ట్రోల్స్ వస్తున్నాయ...