Hyderabad, జూలై 4 -- ఎప్పుడో 13 ఏళ్ల కిందట వచ్చిన ఆశిఖీ 2 మూవీలోని "తుమ్ హి హో" పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న గాయకుడు అరిజిత్ సింగ్. ఇప్పుడు అతడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. స్పాటిఫై మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో 151 మిలియన్ల మంది ఫాలోవర్స్‌తో, గ్లోబల్ పాప్ స్టార్లు టేలర్ స్విఫ్ట్, ఎడ్ షీరన్‌లను అధిగమించి, అత్యధిక మంది ఫాలోవర్స్‌ను కలిగిన ఆర్టిస్ట్ గా నిలిచాడు. ఇది నిజంగా ఒక అద్భుతమైన ఘనత అని చెప్పాలి.

ఈ మ్యూాజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ ను ఫాలో అయ్యే డేటా ట్రాకింగ్ వెబ్‌సైట్‌లు Chartmasters, Volt.fm ఈ వారం విడుదల చేసిన జాబితా ఇలా ఉంది. పాప్ మ్యూజిక్ రంగంలో అతిపెద్ద పేర్లలో ఒకరైన అమెరికన్ గాయని టేలర్ స్విఫ్ట్ 139.6 మిలియన్ల మంది ఫాలోవర్స్‌తో రెండవ స్థానంలో ఉంది. ఇటీవల తన ఇండియా-నేపథ్య ట్రాక్ "సఫైర్"తో వచ్చిన బ్రిటన...