భారతదేశం, జూన్ 24 -- పోకో అధికారికంగా పోకో ఎఫ్ 7 5 జీని భారతదేశంతో పాటు ఎంపిక చేసిన దేశాల మార్కెట్లలో ప్రవేశపెట్టింది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 4 చిప్ సెట్, థర్మల్ మేనేజ్ మెంట్ కోసం 6,000 ఎంఎం 3 వేపర్ ఛాంబర్, షియోమీ ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైపర్ ఓఎస్ 2.0 ఇంటర్ ఫేస్ వంటి హార్డ్ వేర్ స్పెసిఫికేషన్లతో ఈ స్మార్ట్ ఫోన్ వస్తోంది.

పోకో ఎఫ్7 5జీ స్మార్ట్ఫోన్ జూలై 1 నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.31,999గానూ, 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.33,999గానూ నిర్ణయించారు. సైబర్ సిల్వర్ ఎడిషన్, ఫ్రాస్ట్ వైట్, ఫాంటమ్ బ్లాక్ అనే మూడు కలర్ లలో ఇది అందుబాటులో ఉంటుంది.

ఈ ఫోన్ లో 6.83 అంగుళాల అమోఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రిజల్యూషన్ (1,280...