భారతదేశం, జనవరి 23 -- సోషల్ మీడియాలో వేగంగా మారుతున్న ట్రెండ్స్, పెరుగుతున్న సైబర్ ముప్పుల నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ 'స్నాప్‌చాట్' కీలక నిర్ణయం తీసుకుంది. టీనేజర్ల ఆన్‌లైన్ భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో తన 'ఫ్యామిలీ సెంటర్' ఫీచర్‌ను మరింత అప్‌డేట్ చేసింది. భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా ఈ కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.

కేవలం నిఘా పెట్టడమే కాకుండా, ఆన్‌లైన్ ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లపై పిల్లలు, తల్లిదండ్రుల మధ్య ఆరోగ్యకరమైన చర్చలు జరగాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేశామని కంపెనీ పేర్కొంది.

స్నాప్​చాట్​ కొత్త అప్‌డేట్ ప్రకారం.. గడిచిన వారం రోజుల్లో తమ పిల్లలు ఎవరితో ఎక్కువగా చాట్ చేశారు, ఎవరితో టచ్‌లో ఉన్నారనే వివరాలను తల్లిదండ్రులు చూడవచ్చు. అయితే, ఇక్కడే ఒక విషయాన్ని గమనించాలి. పిల్లల వ్యక్తిగత సంభాషణలు (చాట్స్) లేదా వారు పంపుకున్న ...