భారతదేశం, ఏప్రిల్ 16 -- సామాజిక మాధ్యమం స్నాప్‌చాట్‌లో ఒక యువతికి యువకుడు ప‌రిచ‌యం అయ్యాడు. కొన్ని రోజులు బాగానే మాట్లాడుకున్నారు. వీడియో కాల్స్ కూడా చేసి మాట్లాడేవారు. అయితే ఉన్నట్టుండి ఆమెను అత‌డు డ‌బ్బులు డిమాండ్ చేశాడు. త‌న వ‌ద్ద డ‌బ్బులు లేవ‌ని యువ‌తి చెప్పడంతో, ఆమె న‌గ్న చిత్రాల‌ను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్టు చేశాడు. దీంతో ఆ యువ‌తి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు న‌మోదు చేసి విచార‌ణ జ‌రుపుతున్నారు.

ఈ ఘ‌ట‌న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆల‌మూరు మండ‌లంలోని ఒక గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం ఆల‌మూరు మండ‌లంలోని ఒక గ్రామానికి చెందిన యువ‌తికి ఏడాది క్రితం సామాజిక మాధ్యమం స్నాప్‌చాట్‌లో క‌ర్నూలు జిల్లా క‌ల్లూరు మండ‌లం త‌ట‌క‌నాప‌ల్లికి చెందిన ప‌డిపోవు హ‌రీష్ (20) ప‌రిచ‌యం అయ్యారు. కొన్ని రోజుల‌కు ఇ...