Hyderabad, మే 13 -- రెగ్యూలర్ పనులకు వెళ్లే ముందు మనలో చాలా మందికి స్నానం చేయడం తప్పనిసరి పని. స్నానాన్ని చిన్నప్పటి నుంచి అలవాటు ప్రకారం హడావుడిగా కానిచ్చేస్తుంటాం. అందులో కొన్ని పొరబాట్లు కూడా యాదృచ్చికంగా జరిగిపోతుంటాయి. వాటి వల్ల మన ఆరోగ్యానికి హానికరం కూడా. అలాంటి ఒక చెడు అలవాటే స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేయడం. ఇది చాలా సాధారణమైన అలవాటుగా అనిపించినా, దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ చిన్న అలవాటు మీకు చాలా హానికరం. కాబట్టి, ఈ అలవాటు వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలిస్తే, మళ్ళీ ఈ రెండు పనులను ఒకేసారి చేయరు.

మీరు తరచుగా స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేస్తే, క్రమంగా అది అలవాటుగా మారుతుంది. భవిష్యత్తులో, నీటి శబ్దం విన్నప్పుడల్లా మీకు మూత్ర విసర్జన చేయాలనిపిస్తుంది. మన మెదడు, శరీరం దానికి అలవాటు...