భారతదేశం, జూలై 10 -- హైదరాబాద్, జూలై 10, 2025: తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సెక్రటేరియట్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కులగణన సర్వే ఆధారంగా చట్టం చేశామని, దీనిని గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించడం జరిగిందని పేర్కొన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, 2024 ఫిబ్రవరి 4న కుల గణన సర్వే చేపట్టామని, 2025 ఫిబ్రవరి 4 నాటికి ఈ గణన ఆమోదం పొందిందని తెలిపారు. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చట్టంలో పొందుపరిచామని చెప్పారు. ఈ చ...