Telangana, సెప్టెంబర్ 26 -- స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 42 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా జీవో నెంబరు 9ని విడుదల చేసింది. జీవోలో సామాజిక న్యాయం అంశాన్ని ప్రస్తావించిన ప్రభుత్వం.. శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో కూడా బిల్లును ప్రవేశపెట్టగా ఆమోదం కూడా పొందింది. అంతేకాకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వ ఉత్తర్వులు(జీవో) ఇవ్వాలని ఇటీవల మంత్రి మండలి నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఇక రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల (ఎస్ఈఈపీసీ) సర్వేను కూడా నిర్వహించింది. ఇది రాష్ట్రంలోని వివిధ కులాల సాపేక్ష ఆర్థిక, సామాజిక, విద్య...