Telangana,hyderabad, ఆగస్టు 31 -- రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. వచ్చే సెప్టెంబర్ నెలలోనే ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఎన్నికల సంఘం. ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే సూచనలున్నాయి. సెప్టెంబరు 10వ తేదీ నాటికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటర్లు, పోలింగ్‌ కేంద్రాల తుది జాబితా ప్రచురించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శనివారం కలెక్టర్లకు ఉత్తర్వులు ఇచ్చింది.

ఇక రాష్ట్రంలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కొద్దిరోజుల కిందటే ఖరారయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 31 జడ్పీ స్థానాలు, 566 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు.. 5,773 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

రాష్ట్రంలో మొత్తం 12,778 గ్రామ పంచాయతీలు ఉండగా. 1.12 లక్షల వార్డులు ఉన్నట్లు ప్రభుత్వం వివరించింది. ఈ మేరకు...