Telangana, అక్టోబర్ 4 -- తెలంగాణలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా. త్వరలోనే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. దీంతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించిన తర్వాత... గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నారు.

పార్టీ గుర్తుపై నిర్వహించే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కొన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. స్థానికుడై ఉండటంతో పాటు పార్టీ నుంచి కూడా అధికారికంగా బీఫారమ్ తీసుకోవాల్సి ఉంటుంది. నామినేషన్ల ప్రక్రియకు అనుగుణంగా వివరాలుంటేనే బరిలో ఉంటారు. లేకపోతే ఆయా అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించే అవకాశం ఉంటుంది.

రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 565 మండలాల్లో 5749 ఎంపీటీసీ, 656 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటిక...