భారతదేశం, నవంబర్ 17 -- తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై కొంతకాలంగా సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా కేబినెట్ స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన వారోత్సవాల అనంతరం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ వారోత్సవాలు డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు జరుగుతాయి. తర్వాత ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే డిసెంబర్ రెండోవారం లేదంటే మూడో వారంలో నిర్వహించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేసిందనే విషయాలను ప్రజాపాలన వారోత్సవాల్లో వివరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేసి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలని అనుకుంటోంది. జూబ్లీహిల్స్ విజయంతో కేడర్ జోష్‌లో ఉంది. ఇదే ఊపులో గ్రామస్థ...