భారతదేశం, ఏప్రిల్ 18 -- ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు నెలకొంది. లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం నియమించిన ఇందిరమ్మ కమిటీల్లో తమ వర్గానికే ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు పట్టుబడుతున్నారు. దీంతో పార్టీలోని పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయ లోపం తలెత్తుతోంది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి నేతలు చేరిన చోట ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది.

కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న చోట ఇబ్బంది కొంత లేకపోయినా, ఎమ్మెల్యే లేని చోట, లేదా ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే ఉన్న చోట సమస్యలు తలెత్తుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో ఇందిరమ్మ కమిటీలు కీలకంగా వ్యవహరించనున్నాయి. కాంగ్రెస్ పార్టీ వారిని ఈ కమిటీల్లో నియమించడం వల్ల ఇండ్ల కేటాయింపులో అర్హులకు న్యాయం జరగదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అధికార పార్టీ వారికి మేలు చేస...