భారతదేశం, డిసెంబర్ 4 -- వచ్చే జన‌వ‌రి నెలాఖ‌రుక‌ల్లా రెవెన్యూ, స‌ర్వే, రిజిస్ట్రేష‌న్ శాఖ‌ల స‌మాచారంతో కూడిన సింగిల్ పేజీ డిజిట‌లైజేష‌న్‌ను అందుబాటులోకి తీసుకువ‌స్తామని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి తెలిపారు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే NIC త‌గు క‌స‌ర‌త్తు చేస్తోందన్నారు.

రాష్ట్రంలో న‌క్షాలు లేని 413 గ్రామాల్లో స‌రిహ‌ద్దుల‌, భూధార్ నెంబ‌ర్ల కేటాయింపు వంటి ప్ర‌ధాన అంశాల‌తో కూడిన సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు ప్ర‌యోగాత్మ‌కంగా ఐదు గ్రామాల‌ను ఎంపిక చేసి ప‌ని పూర్తి చేశామని మంత్రి పొంగులేటి వివరించారు. ఈ ఐదు గ్రామాల‌కు భూదార్ కార్డులు సిద్దంగా ఉన్నాయని. స్థానిక ఎన్నికల తర్వాత వాటిని అందజేస్తామని ప్రకటించారు. మిగిలిన 408 గ్రామాల్లో ప‌ట్ట‌ణ ప్రాంతాలు మిన‌హా 373 గ్రామాల్లో రెండ‌వ విడ‌త కింద స‌ర్వే నిర్వ‌హిస్తామని చెప్పారు. మూడ‌వ విడ‌త‌గా అన్ని...