Telangana, సెప్టెంబర్ 26 -- స్థానిక ఎన్నికలపై తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసి. ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఏ క్షణమైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా కీలక ప్రకటన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 69 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని ప్రకటించారు.

తమిళనాడు ప్రభుత్వం చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన 'విద్యా పునరుజ్జీవన వేడుక' కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 27 శాతం కలిపి మొత్తం 69 శాతం రిజర్వేషన్లు అమలు చేయబోతున్నట్టు స్పష్టం చేశారు.

"రిజర్వేషన్ల విషయంలో తమ...