భారతదేశం, అక్టోబర్ 9 -- బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రస్తుత నోటిఫికేషన్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికల కోడ్‌ అమలు, నామినేషన్ల ప్రక్రియను నిలిపివేసినట్లు స్పష్టం చేసింది.తదుపరి నోటిఫికేషన్‌ ఇచ్చేవరకు ఎన్నికల ప్రక్రియలన్నీ ఆపివేస్తున్నట్లు తెలిపింది. దీంతో రాష్ట్రంలో నిర్వహించాల్సిన స్థానిక ఎన్నికల ప్రక్రియ ఆగిపోయినట్లు అయింది.

రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయంతో MPTC, ZPTC ఎన్నికల గెజిట్‌ నిలిచిపోయినట్లు అయింది. దీంతో సెప్టెంబర్‌ 29న విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్‌ సస్పెండ్‌ అయింది. హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేయగా.. త్వరలోనే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం ఏ వి...