భారతదేశం, సెప్టెంబర్ 14 -- వికసిత్ భారత్‌కు మహిళల నాయకత్వం అనే నినాదంతో తిరుపతిలో తొలి జాతీయ మహిళా సాధికారత సదస్సు జరిగింది. ఇందులో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా పాల్గొన్నారు. రెండు రోజుల సదస్సు తిరుపిలోని రాహుల్ కన్వెన్షన్‌లో జరుగుతోంది. ముఖ్యఅతిథిగా స్పీకర్ ఓంబిర్లాతోపాటుగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు.

అంతేకాకుండా ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఏపీ శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, పార్లమెంట్‌ కమిటీ (మహిళా సాధికారత) ఛైర్‌పర్సన్‌ దగ్గుబాటి పురందేశ్వరి, మంత్రులు, ఎంపీలు, నేతలు పాల్గొన్నారు.

ఈ సదస్సులో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడారు. దేశంలో ఆధ్యాత్మిక, సామాజిక ఉద్యమాల్లో మహిళలు కీలక పాత్ర పోషించారని అ...