భారతదేశం, జూలై 8 -- గుండెపోటు, పక్షవాతం (స్ట్రోక్) వంటివి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రాణాలను తీస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా జరిగే మరణాల్లో దాదాపు 32 శాతం గుండె సంబంధిత వ్యాధుల (CVDs) వల్లే సంభవిస్తున్నాయి. 2019లో సుమారు 1.79 కోట్ల మంది CVDల వల్ల చనిపోగా, వీరిలో 85 శాతం మంది గుండెపోటు లేదా స్ట్రోక్ వల్లే మరణించారు. ఇంతకీ గుండె జబ్బులు ఎందుకు వస్తాయి? గుండెపోటు, స్ట్రోక్ లక్షణాలు ఏమిటి? ఈ ప్రమాదాన్ని ఎలా తగ్గించుకోవచ్చు? తెలుసుకుందాం.

సాధారణంగా గుండెపోటు, స్ట్రోక్ అంటే గుండెకు లేదా మెదడుకు రక్తం సరఫరాను అడ్డుకునే అడ్డంకుల వల్ల వచ్చే సమస్యలు. రక్తనాళాల లోపలి గోడలపై కొవ్వు పేరుకుపోవడం దీనికి ప్రధాన కారణం. కొన్నిసార్లు మెదడులోని రక్తనాళం పగలడం లేదా రక్తం గడ్డకట్టడం వల్ల కూడా స్ట్రోక్ రావచ్చు.

గుండె జబ్బు ...