భారతదేశం, డిసెంబర్ 13 -- అందరి హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ అందరి హీరోల ఫ్యాన్స్ విక్టరీ వెంకటేష్ కు ఉంటారని ఎవరో చెప్పారు. అది అక్షర సత్యం. ఏ మాత్రం నెగెటివిటీ లేని, ఎప్పుడూ పాజిటివ్ గా ఉండే హీరో వెంకటేష్. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి యూత్ వరకూ ఆయన సినిమాలను చూసేస్తారు. వెంకీ మామ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈ రోజు (డిసెంబర్ 13) వెంకీ మామ బర్త్ డే. ఈ సందర్భంగా మన శంకర వరప్రసాద్ గారు మూవీ నుంచి ఆయన లుక్ రిలీజ్ చేశారు.

వెంకటేష్ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులకు డైరెక్టర్ అనిల్ రావిపూడి అదిరిపోయే స‌ర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. మన శంకర వరప్రసాద్ గారు మూవీ నుంచి వెంకీ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ మేరకు ఓ వీడియోతో పోస్టర్ పంచుకున్నాడు. ఈ పోస్టర్ లో వెంకీ స్టైలిష్ లుక్ అదుర్స్ అనిపించేలా ఉంది. వెనుక బ్లాక్ డ్రెస్ లో గన్స్ పట్టుకుని బాడీగార్డ్స్ వస్తుంటే ముందు అ...