భారతదేశం, మే 4 -- స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం సినిమాల్లో యాక్టింగ్‍కు బ్రేక్ ఇచ్చారు. చివరగా 2023లో ఖుషి చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత మయోసైటిస్‍కు చికిత్స తీసుకున్నారు. మళ్లీ త్వరలో రీ-ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సమంత నిర్మాతగా మారారు. త్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మొదలుపెట్టి తొలి చిత్రంగా 'శుభం'ను నిర్మించారు. ఈ హారర్ కామెడీ మూవీ మే 9న విడుదల కానుంది. ఈ తరుణంలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు (మే 4) జరిగింది.

వైజాగ్‍లో జరిగిన శుభం సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు సమంత హాజరయ్యారు. ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేసిన సామ్ ఈ ఈవెంట్‍లో జోష్‍గా కనిపించారు. తన అభిమానులతోనూ మాట్లాడారు.

శుభం ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో సమంత డ్యాన్స్ చేశారు. స్టేజ్‍పై స్టెప్‍లతో జోష్ నింపారు. ఈ చిత్రంలోని జన్మజన్మల బంధం అనే పాటకు మూవీ టీమ్‍తో కలిస...