Hyderabad, జూలై 28 -- ప్రముఖ అంతర్జాతీయ పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్ (J.Lo) ఈ మధ్య వార్సా కాన్సర్ట్ లో అనుకోకుండా జరిగిన ఓ వార్డ్‌రోబ్ మాల్‌ఫంక్షన్‌ను ఎంతో హుందాగా ఎదుర్కొంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. జులై 25న వార్సాలో జరిగిన తన కాన్సర్ట్ లో 'ఆన్ ది ఫ్లోర్' సింగర్ తన స్కర్ట్ ఊడిపోయినా దానిని తన సమయస్ఫూర్తితో కవర్ చేసి ఫ్యాన్స్ ప్రశంసలు అందుకుంది.

యాహూ రిపోర్ట్ ప్రకారం.. జెన్నిఫర్ లోపెజ్ తన ప్రదర్శన మధ్యలో ఉన్నప్పుడు ఆమె స్కర్ట్ అనుకోకుండా కిందకు జారి, లోదుస్తులు కనిపించాయి. కానీ ఆమె ఏమాత్రం తడబడకుండా.. ఓ నవ్వు నవ్వి, సరదాగా ప్రేక్షకులతో, "నేను నా లోదుస్తుల్లో ఇక్కడ ఉన్నాను" అని చెప్పింది. అంతేకాదు ఆ తర్వాత కూడా ఆమె ఎంతో ఉత్సాహంగా పర్ఫామ్ చేసింది.

వెనుక ఉన్న డ్యాన్సర్ ఆమె దుస్తులను సరిచేసేలోపు, ఆ...