భారతదేశం, డిసెంబర్ 28 -- ప్రభాస్, మారుతి మధ్య ఎంతటి బలమైన అనుబంధం ఉందో ది రాజా సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్లో స్పష్టమైంది. ఈ ఈవెంట్లో ప్రభాస్ తన ఎదురుగా కూర్చొన్నప్పుడు మారుతి మాట్లాడలేక పదే పదే ఏడ్చేశాడు. ఈ ఈవెంట్ శనివారం (డిసెంబర్ 27) రాత్రి హైదరాబాద్ లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'ది రాజా సాబ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ఒక ఎమోషనల్ సంఘటన చోటు చేసుకుంది. సినిమా గురించి, ప్రభాస్ గురించి మాట్లాడుతూ డైరెక్టర్ మారుతి స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది చూసిన వెంటనే ప్రభాస్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈవెంట్‌లో మైక్ అందుకున్న మారుతి.. గత మూడేళ్లుగా తాను పడుతున్న ఆవేదనను బయటపెట్టాడు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి తనపై వచ్చిన విపరీతమైన ట్రోలింగ్, నెగెటివిటీని తలుచుకుని అతడు ఎమోషనల్ అ...