భారతదేశం, జూన్ 12 -- లార్డ్స్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ సత్తాచాటాడు. హిస్టరీ క్రియేట్ చేశాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2025 ఫైనల్ లో దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన మ్యాచ్ లో తొలి రోజు స్మిత్ మెరిశాడు. బుధవారం (జూన్ 11) ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 36 ఏళ్ల స్మిత్ 112 బంతుల్లో 66 పరుగులు చేశాడు. తన టీమ్ 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో స్మిత్ క్రీజులోకి వచ్చి ఆదుకున్నాడు. అతను 10 బౌండరీలు కొట్టాడు. ఈ క్రమంలోనే చరిత్ర నెలకొల్పాడు.

డాన్ బ్రాడ్‌మన్, గ్యారీఫీల్డ్ సోబర్స్, వారెన్ బ్రాడ్స్‌లీ వంటి లెజెండ్‌లను దాటి స్మిత్ చిరస్మరణీయమైన రికార్డును నెలకొల్పాడు. లార్డ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాటర్‌గా నిలిచాడు. స్మిత్ ఇప్పుడు లార్డ్స్‌లో ఆడిన ఆరు మ్యాచ్‌లలో 10 ఇన్నింగ్స్‌లలో 591 పరుగులు చేశ...