భారతదేశం, సెప్టెంబర్ 13 -- ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ సంస్థకు పెద్ద సమస్య ఎదురైంది! అక్రమ పద్ధతులను అవలంబిస్తోందని ఆరోపిస్తూ.. సంస్థకు సంబంధించిన క్యాష్‌లెస్ సేవలను అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ ఇండియా (ఏహెచ్​పీఐ) రద్దు చేసే అవకాశం ఉంది. ఇదే విషయంపై ఆసుపత్రుల సంఘం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

15,000కు పైగా ఆసుపత్రులకు ప్రాతినిధ్యం వహించే ఏహెచ్​పీఐ, స్టార్ హెల్త్ సంస్థతో సెప్టెంబర్ 22లోగా ఒక ఒప్పందానికి రాకపోతే, ఆ రోజు నుంచి స్టార్ హెల్త్ పాలసీదారులకు క్యాష్‌లెస్ సేవలను నిలిపివేస్తామని స్పష్టం చేసింది. గతంలో, బజాజ్ అలయన్స్​ జనరల్ ఇన్సూరెన్స్, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు కూడా ఏహెచ్​పీఐతో ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నాయి. అయితే చర్చల ద్వారా ఆ సమస్యలను పరిష్కరించుకున్నాయి!

ఏహెచ్​పీఐ సభ్య...