భారతదేశం, జనవరి 29 -- రెబల్ స్టార్ ప్రభాస్ కు ఓ పాట తెగ నచ్చేసింది. ఆ పాట పాడిన గొంతుకు ఇంప్రెస్ అయిపోయాడు. అందుకే సోషల్ మీడియాలో ఆ సింగర్ ను పొగిడేస్తూ స్టోరీ పెట్టాడు. ఇంతకీ ఆ సింగర్ ఎవరో కాదు స్టార్ హీరోయిన్ రవీనా టండన్ కూతురు రాషా థడానీ. 'లాయ్కే లాయ్కా' అనే తన రాబోయే చిత్రంలోని 'చాప్ తిలక్' పాటతో సింగింగ్ డెబ్యూ ఇచ్చినందుకు రాషాను ప్రభాస్ ప్రశంసించాడు.

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ప్రభాస్ రాషాకు అభినందనలు తెలుపుతూ ఒక స్వీట్ నోట్ పంచుకున్నాడు. ఆమె కూడా ఆయన సందేశానికి స్పందించింది. ప్రభాస్ రాషా థడాని గాత్రాన్ని ప్రశంసించాడు. రాషా 'చాప్ తిలక్' పాడుతున్న వీడియోను పోస్ట్ చేసి, "రాషా థడానీ మీ సింగింగ్ డెబ్యూ చాలా అద్భుతంగా ఉంది. చాప్ తిలక్ లో మీ గానం నిజాయితీగా, హృదయపూర్వకంగా, నేరుగా హృద‌యం లోప‌లి నుంచి వచ్చింది" అని ప్రభాస్ రాసుకొచ్చాడు.

ప...