భారతదేశం, ఫిబ్రవరి 7 -- బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, తృప్తి దిమ్రి జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'ఓ రోమియో'. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా శుక్రవారం ముంబైలో 'పాన్ కీ దుకాన్' అనే పాటను విడుదల చేశారు. అయితే, ఓ రోమియో సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ఊహించని సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అభిమానుల ఉత్సాహం హద్దులు దాటడంతో హీరో షాహిద్ కపూర్‌కు కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు.

సాంగ్ లాంచ్ ఈవెంట్ జరుగుతున్న సమయంలో షాహిద్ కపూర్ తనతో పాటు డాన్స్ చేయడానికి కొందరు అభిమానులను స్టేజ్ మీదకు ఆహ్వానించారు. అలా హీరో చేసిన ఒక్క తప్పుతో ఆ ఒక్క క్షణంలోనే పరిస్థితి తలకిందులైంది. అనుమతి లేని వారు కూడా భారీ సంఖ్యలో స్టేజ్ మీదకు దూసుకువచ్చారు.

ఒక్కసారిగా స్టేజ్ మీదకు దూసుకొచ్చిన ఫ్యాన్స్ షాహిద్ కపూర్‌ను అందరూ ఒకేసారి చుట్టుముట్టారు. తమ అభిమాన...