భారతదేశం, నవంబర్ 1 -- తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తాజాగా బయటపెట్టిన ఓ సంఘటన సంచలనంగా మారింది. ఓ ఫ్యాన్ షేక్ హ్యాండ్ ఇచ్చే సమయంలో బ్లేడ్ తో తన అరచేతిని కోశాడని అజిత్ వెల్లడించాడు. తమ అభిమాన సెలబ్రిటీలను కలిసినప్పుడు ఫ్యాన్స్ ఎలా ప్రవర్తించాలని ఆశిస్తారనే దానిపై అజిత్ సుదీర్ఘంగా మాట్లాడారు. ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు.

అభిమానులు తన కారు ముందు వారి వాహనాలను ఆపి, సెల్ఫీల కోసం కారు కిటికీ అద్దాలు దించమని అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయని అజిత్ చెప్పాడు. వచ్చిన వ్యక్తి నిజంగా అభిమానా లేక హాని తలపెట్టే వ్యక్తా అని ఒక సెలబ్రిటీకి ఎలా తెలుస్తుందని కూడా అజిత్ ప్రశ్నించాడు. ఈ సందర్భంలోనే ఒకసారి ఒక వ్యక్తి తనను పలకరిస్తూ తన అరచేతిని కోసిన విషయాన్ని అజిత్ వెల్లడించాడు. అభిమానుల వల్ల తాను చాలాసార్...