Hyderabad, జూలై 3 -- స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ 25వ వారం టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. వీటిలో ఎప్పటిలాగే కార్తీకదీపం 2 సీరియల్ దూసుకెళ్తోంది. ఇది దేనికీ అందనంత ఎత్తులో ఉంది. ఇక రెండో స్థానం కోసం ఇల్లు ఇల్లాలు పిల్లలు, గుండె నిండా గుడి గంటలు, ఇంటింటి రామాయణం మధ్య తీవ్ర పోటీ నెలకొంది. టాప్ 10లో మూడు జీ తెలుగు సీరియల్స్ స్థానం సంపాదించాయి.

స్టార్ మా సీరియల్స్ కొన్నేళ్లుగా టీఆర్పీ రేటింగ్స్ విషయంలో ఇతర ఛానెల్స్ కు అందనంత ఎత్తులో ఉంటున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా ఆ ఛానెల్ కు చెందిన సీరియల్స్ మంచి రేటింగ్స్ సాధించాయి. తొలి స్థానంలో కార్తీకదీపం 2 సీరియల్ కొనసాగుతోంది. ఈవారం ఈ సీరియల్ కు ఏకంగా 13.91 రేటింగ్ రావడం విశేషం. ఇతర ఏ సీరియల్ కూ అందనంత ఎత్తులో ఉండటం విశేషం. ఇక రెండో స్థానం కోసమే అసలైన పోటీ నెలకొంది.

ప్రస్తుతం ఇల్లు ఇల్లాలు పి...