Hyderabad, జూన్ 12 -- తెలుగు టీవీ సీరియల్స్ 22వ వారానికి సంబంధించిన టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. ఈసారి కూడా స్టార్ మా సీరియల్స్ తమ ఆధిపత్యాన్ని కొనసాగించాయి. గత వారం టాప్ 10లో నుంచి ఒక సీరియల్ ను కోల్పోయిన ఆ ఛానెల్.. ఈ వారం మళ్లీ దానిని తిరిగి పొందింది. ఇక జీ తెలుగు నుంచి కేవలం రెండు సీరియల్సే టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి.

స్టార్ మా సీరియల్స్ 22వ వారం కూడా సత్తా చాటాయి. ఆ ఛానెల్లో వచ్చే కార్తీకదీపం ఎవరికీ అందనంత ఎత్తుకు దూసుకెళ్తోంది. తాజా రేటింగ్స్ లో 12.75తో కార్తీకదీపం తొలి స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఇక రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు 11.71తో నిలిచింది.

మూడో స్థానంలో ఉన్న ఇంటింటి రామాయణం ఈ వారం తన రేటింగ్ చాలా మెరుగుపరచుకుంది. తాజాగా ఈ సీరియల్ కు 11.26 రేటింగ్ వచ్చింది. గుండె నిండా గుడి గంటలు సీరియల్ నాలుగో స్థానానికి ...