Hyderabad, జూన్ 5 -- తెలుగు టీవీ సీరియల్స్ 21వ వారం టీఆర్పీ రేటింగ్స్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. కొంతకాలంగా వెనుకబడిన జీ తెలుగు సీరియల్స్ మరోసారి సత్తా చాటాయి. స్టార్ మాకు చెందిన రెండు సీరియల్స్ టాప్ 10లో నుంచి వెళ్లిపోగా.. వాటి స్థానంలో జీ తెలుగుకు సంబంధించిన సీరియల్స్ వచ్చాయి. మరి టాప్ 10లో ఏయే సీరియల్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం.

స్టార్ మా సీరియల్స్ 21వ వారం కూడా సత్తా చాటినా.. టాప్ 10లో మాత్రం రెండు సీరియల్స్ ను కోల్పోయింది. గత రెండు మూడు వారాలుగా 9 సీరియల్స్ ఈ ఛానెల్ కు చెందినవే ఉండేవి. కానీ తాజాగా రేటింగ్స్ నుంచి నిన్ను కోరి, పలుకే బంగారమాయెనా టాప్ 10 నుంచి వెళ్లిపోయాయి. కార్తీకదీపం సీరియల్ 12.26 రేటింగ్ తో తొలి స్థానంలో కొనసాగుతోంది. ఇక ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ 11.79 రేటింగ్ తో రెండో స్థానంలో ఉంది.

మూడు, నాలుగు స్థానాల కోసం...