Hyderabad, అక్టోబర్ 3 -- టాప్ 10 తెలుగు టీవీ సీరియల్స్ లో కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా 38వ వారానికి సంబంధించిన రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. వీటిలో కార్తీకదీపం 2 సీరియల్ తొలి స్థానంలో కొనసాగుతుండగా.. చిన్ని, నిండు మనసులులాంటి సీరియల్స్ ఈవారం ఆశ్చర్యపరిచాయి. అటు టాప్ 10లో నాలుగు జీ తెలుగు సీరియల్స్ ఉన్నాయి.

తెలుగు టీవీ సీరియల్స్ 38వ వారం టీఆర్పీ రేటింగ్స్ విషయంలో కీలకమైన మార్పు అంటే నిండు మనసులు టాప్ 10లోకి రావడమే. ఈ సీరియల్ తొలిసారి ఈ ఘనత సాధించింది. తాజాగా రేటింగ్స్ లో 8.03తో ఏడో స్థానానికి దూసుకొచ్చింది. ఈ సీరియల్ స్టార్ మాలో సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ సాయంత్రం 6.30 గంటలకు టెలికాస్ట్ అవుతుంది.

దీంతోపాటు చిన్ని సీరియల్ కూడా తొలిసారి నాలుగో స్థానానికి దూసుకురావడం విశేషం. చాలా రోజులుగా ఐదు, ఆరు స్థానాలకు పరిమితమైన చి...