Hyderabad, జూన్ 19 -- స్టార్ మా, జీ తెలుగు ఛానెల్స్ లో వచ్చే తెలుగు సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. ఎప్పటిలాగే కార్తీకదీపం ఈ వారం కూడా టాప్ లో నిలిచింది. అంతేకాదు తన రేటింగ్ ను మరింత మెరుగుపరచుకొని రెండో స్థానంలో ఉన్న సీరియల్ కు అందనంత ఎత్తుకు చేరింది. మరి 23వ వారంలో టాప్ 10 తెలుగు సీరియల్స్ ఏవో ఒకసారి చూద్దాం.

ఈ ఏడాది 23వ వారానికి సంబంధించిన స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. కార్తీకదీపం 2 సీరియల్ టాప్ లోనే కొనసాగుతోంది. అయితే ఈసారి ఆ సీరియల్ రేటింగ్ ఏకంగా 13.16కు చేరడం విశేషం. రెండో స్థానంలో ఉన్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కు 12.16 రేటింగ్ రాగా.. దానికంటే చాాలా ఎత్తున కార్తీకదీపం నిలిచింది. ఇక మూడోస్థానంలో ఇంటింటి రామాయణం సీరియల్ 12.02 రేటింగ్ సాధించింది. ఈ సీరియల్ రేటింగ్ కూడా 23వ వారం మెరుగైంది....