Hyderabad, జూలై 24 -- తెలుగు టీవీ సీరియల్స్ 28వ వారానికి సంబంధించిన టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. ఈసారి కూడా స్టార్ మా సీరియల్స్ హవా కొనసాగినా.. టాప్ 5లో ఆ ఛానెల్ కు చెందిన సీరియల్స్ మధ్యే గట్టి పోటీ నెలకొంది. రెండో స్థానంలో ఉంటూ వస్తున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈసారి నాలుగో స్థానానికి పడిపోయింది.

ఈవారం స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ లో గుండె నిండా గుడి గంటలు రేటింగ్ భారీగా పెరిగింది. ఆ సీరియల్ తొలిసారి 13.11 రేటింగ్ తో రెండో స్థానంలో నిలిచింది. ఏకంగా 13 రేటింగ్ దాటడం విశేషమే. ఇక తొలి స్థానంలో కార్తీకదీపం 2 సీరియల్ కొనసాగుతోంది. దీనికి 14.42 రేటింగ్ వచ్చింది. మూడో స్థానంలో 12.92 రేటింగ్ తో ఇంటింటి రామాయణం ఉంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు నాలుగో స్థానానికి పడిపోయింది. ఈ సీరియల్ కు ఈవారం 12.36 రేటింగ్ మాత్రమే వచ్చింది. టాప్ 5లో చెప్పు...