Hyderabad, మే 8 -- తెలుగు టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ చేశారు. అయితే రాను రాను ఇటు స్టార్ మా, అటు జీ తెలుగు సీరియల్స్ రేటింగ్స్ దారుణంగా పతనమవుతూ వస్తున్నాయి. కార్తీకదీపం మళ్లీ టాప్ లోకి వచ్చినా కనీసం 11 రేటింగ్ దాటలేకపోయింది. అటు జీ తెలుగులో అయితే ఒక్క సీరియల్ రేటింగ్ కూడా 6కు మించకపోవడం గమనార్హం.

తెలుగు టీవీ సీరియల్స్ కు సంబంధించి 17వ వారం టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. ఎప్పటిలాగే స్టార్ మా సీరియల్స్ ఆధిపత్యాన్ని కొనసాగించాయి. మూడు, నాలుగు వారాలుగా తన నంబర్ వన్ స్థానాన్ని కోల్పోయిన కార్తీకదీపం.. ఈ వారం మళ్లీ టాప్ లోకి వచ్చింది.

అయితే దాదాపు అన్ని సీరియల్స్ రేటింగ్స్ పతనమవుతున్నాయి. ఒకప్పుడు 13కుపైగా ఉండే కార్తీకదీపం రేటింగ్.. ఇప్పుడు 10.86గా ఉంది. ఇక రెండో స్థానంలో ఉన్న ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒక దశలో 12కుపైగా రేటింగ్ సా...