Hyderabad, మే 29 -- తెలుగు టీవీ సీరియల్స్ కు సంబంధించి 20వ వారానికి టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. గత వారంలాగే ఈ వారం కూడా రేటింగ్స్, టాప్ 10 సీరియల్స్ లో పెద్దగా మార్పులేమీ లేవు. 9 సీరియల్స్ స్టార్ మాకు చెందినవే ఉన్నాయి. జీ తెలుగు నుంచి కేవలం ఒకే ఒక్క సీరియల్ మాత్రమే టాప్ 10లో చోటు దక్కించుకుంది.

తెలుగు టీవీ సీరియల్స్ లో మరోసారి టాప్ ప్లేస్‌లో నిలిచింది కార్తీకదీపం 2. ఈ ఏడాది 20వ వారం కూడా ఆ సీరియల్ కే అత్యధిక రేటింగ్ నమోదైంది. తాజా రేటింగ్స్ లో ఈ సీరియల్ కు 12.02 టీఆర్పీ సాధించింది. ఇక రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఉంది. ఈ సీరియల్ కు 11.19 రేటింగ్ నమోదైంది.

ఇక మూడు, నాలుగు స్థానాల్లో గుండెనిండా గుడిగంటలు (10.38), ఇంటింటి రామాయణం (10.31) ఉన్నాయి. ఐదో స్థానంలో చిన్ని సీరియల్ 7.82 రేటింగ్ తో నిలిచింది. ఇక బ్రహ్మముడి సీర...