భారతదేశం, డిసెంబర్ 18 -- స్టార్ మా ఛానెల్లో ఈ నెల మొదట్లో అంటే డిసెంబర్ 8న టెలికాస్ట్ అయిన సీరియల్ పొదరిల్లు. ఈ సీరియల్ కోసం ఆ ఛానెల్ చేసిన వెరైటీ ప్రమోషన్లు సక్సెస్ అయ్యాయని చెప్పొచ్చు. తొలి వారమే టీఆర్పీ రేటింగ్స్ లో ఈ సీరియల్ రికార్డు రేటింగ్ రావడం విశేషం. మరి తాజాగా 49వ వారం టీఆర్పీ రేటింగ్స్ లో ఏ సీరియల్ ఏ స్థానంలో ఉందో చూడండి.

స్టార్ మా ఛానెల్లో పొదరిల్లు అనే సీరియల్ డిసెంబర్ 8న అడుగుపెట్టింది. దీనికి తొలి వారమే ఏకంగా 8.78 రేటింగ్ నమోదైంది. కేవలం అర్బన్ మార్కెట్ చూస్తే.. ఇది 9.21గా ఉండటం విశేషం. వచ్చీ రావడంతోనే టాప్ 10 సీరియల్స్ లో ఆరో స్థానంలో నిలిచింది. స్టార్ మాలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజూ రాత్రి 9.30 గంటలకు ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతోంది.

ఎలాగైనా తనతోపాటు తన అన్న, తమ్ముళ్లకు పెళ్లిళ్లు చేయాలని కలలు కనే ఓ యువకుడు.....