భారతదేశం, డిసెంబర్ 2 -- తెలుగు టీవీ సీరియల్స్ లో స్టార్ మా ఛానెల్ కు ఓ ప్రత్యేకత ఉంది. టాప్ 10 సీరియల్స్ లో తొలి ఆరు స్థానాలు ఆ ఛానెల్ కు చెందినవే ఉంటాయి. దీంతోపాటు ఎప్పటికప్పుడు సరికొత్త సీరియల్స్ తీసుకొస్తూనే ఉంటుంది. అలా ఇప్పుడు పొదరిల్లు అనే మరో సీరియల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.

స్టార్ మా ఛానెల్లోకి వస్తున్న కొత్త సీరియల్ పొదరిల్లు. ఈ సీరియల్ వచ్చే సోమవారం (డిసెంబర్ 8) నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను మంగళవారం (డిసెంబర్ 2) ఆ ఛానెల్ రిలీజ్ చేసింది. ఎలాగైనా తనతోపాటు తన అన్న, తమ్ముళ్లకు పెళ్లిళ్లు చేయాలని కలలు కనే ఓ యువకుడు.. పెళ్లిపై ఎన్నో ఆశలతో ఉన్న ఓ అమ్మాయి అసలు ఆడదిక్కే లేని ఇంట్లోకి వెళ్తే ఎలా ఉంటుందన్నదే ఈ సీరియల్ కథగా కనిపిస్తోంది.

"తను ఊహించుకున్న జీవితం ఒకటి.. కానీ పరిస్థితులు ఆమెను తీసుకెళ్లిన దా...