Hyderabad, సెప్టెంబర్ 22 -- స్టార్ మా ఛానెల్లోకి ఓ సరికొత్త సీరియల్ అడుగుపెట్టింది. ఈ సీరియల్ పేరు సప్తపది. సోమవారమే (సెప్టెంబర్ 22) తొలి ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. సీనియర్ నటుడు సుమన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుండటంతో ఈ సీరియల్ పై ఆసక్తి పెరిగింది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ ఈ సీరియల్ టెలికాస్ట్ కానుంది.

ఎప్పటికప్పుడు సరికొత్త సీరియల్స్ తో అలరించే స్టార్ మా ఛానెల్ ఇప్పుడు సప్తపది అనే కొత్త సీరియల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈ సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటలకు టెలికాస్ట్ కానుంది. ఒక కొత్త కలల ప్రయాణం అంటూ ఈ సీరియల్ ను స్టార్ మా పరిచయం చేసింది. సోమవారం (సెప్టెంబర్ 22) తొలి ఎపిసోడ్ ప్రసారమైంది.

దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. కన్నడ సీరియల్ స్నేహద కదలల్లి అనే సీరియల్ కు ఇది రీమ...