Hyderabad, ఆగస్టు 8 -- ది కశ్మీర్ ఫైల్స్ మూవీ ఎంత సంచలనం సృష్టించిందో తెలుసు కదా. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన వివేక్ అగ్నిహోత్రి మరోసారి తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పాడు. హిందీ సినిమాలు గత కొన్నాళ్లుగా దారుణంగా విఫలమవుతుండటానికి స్టార్ కిడ్స్ పై ఇండస్ట్రీకి ఉన్న అతి ప్రేమే కారణమని అతడు అన్నాడు. రైటర్లకు కనీస విలువ ఇవ్వడం లేదని కూడా వివేక్ అభిప్రాయపడ్డాడు.

సిద్ధార్థ్ కన్నన్ తో జరిగిన ఇంటర్వ్యూలో వివేక్ అగ్నిహోత్రి మాట్లాడాడు. "సినీ పరిశ్రమలోకి కొత్త టాలెంట్ రావడం లేదు. సామాన్యుడు రాలేని పరిస్థితి. ఒకవేళ షారూఖ్ ఖాన్ లాంటి వ్యక్తి ఈరోజు వచ్చినా, అతడికి ఇంగ్లీష్ మాట్లాడటం రాకపోతే, ఉన్నత కుటుంబం నుండి రాకపోతే, ఒక స్టూడియోలోకి ఎలా అడుగుపెట్టగలుగుతాడు?

మీ స్టాండర్డ్ ప్రకారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంత మంది ఫాలోవర్స్ ఉండాలి, దాని ఆధారంగా మీ నటనను జడ్...